
చేగుంట,నవంబర్ 23: ఆన్లైన్ మోసాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చేగుంట ఏఎస్సై శ్రీహరి అన్కారు. చేగుంట పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి, చేగుంట, మక్కరాజిపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలపై మంగళవారం పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు దేవయ్య, మాధవి, విజయకుమారి, ఉపాధ్యాయులు మంజులత, పద్మ, కృష్ణవేణి, వెంకటమ్మ, లింగయ్య, దేవర్షి, సరస్వతి, మౌనిక, సిద్దార్థ, సుధాకర్‌రెడ్డి, చల్లా లక్ష్మణ్, చక్రధర్, రాథోడ్ ఉన్నారు
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట, నవంబర్ 23: చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం అర్చన మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే ఇవ్వొద్దన్నారు. ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాగ్సాన్పల్లిలో..
పాపన్నపేట, నవంబర్ 23: పోలీసుశాఖ, విద్యాశాఖ, యంగి స్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలలో సైబర్ మోసాలపై సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నేరాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలకు చెందిన శ్రావ్య, విష్ణువర్ధన్ సైబర్ నేరాలపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, కానిస్టేబుల్ మహేశ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలి
కొల్చారం, నవంబర్ 23: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని ట్రైనీ ఎస్సై యాసిన్‌అలీ తెలిపారు. మండల పరిధిలోని ఎనగండ్ల, రంగంపేట పాఠశాలలో మంగళవారం యంగిస్థాన్ ఫౌండేషన్ సారథ్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాలో వచ్చే వాటిని స్వీకరించొద్దు
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 23: సోషల్ మీడియాలో వచ్చే వాటిని స్వీకరించొద్దని పట్టణ ఎస్సై రఫిక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్లో వచ్చినది మంచి, చెడు తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు.