హన్వాడలో జోరుగా కూరగాయల సాగు
టమోట, వంకాయ, క్యాబేజీపై ఆసక్తి
తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు
హన్వాడ, నవంబర్ 22 :కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం సమీప గ్రామాల్లో, హన్వాడ మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 60శాతం రైతులు కూరగాయలు పండిస్తున్నారు. నీటి వినియోగం తక్కువగా, దిగుబడి అధికంగా ఉండటంతో టమాట, వంకాయ, క్యాబేజీ, కాకర తదితర కూరగాయల పంటలు అధికంగా వేస్తున్నారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సూచనలు, సలహాలు ఇవ్వడంతో ఆకుకూరలు, కూరగాయల సాగుపై మొగ్గు చూపుతున్నారు.
కూరగాయల సాగు జోరుగా కొనసాగుతున్నది. మండలంలోని ఎనిమిది గ్రామాల్లో దా దాపు 60 శాతం మంది రైతులు కూరగాయల సాగుపై ఆస క్తి చూపుతున్నారు. టమాటా, వంకాయ, క్యాబేజీ, కాకర, చిక్కుడు వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. త క్కువ పెట్టుబడి, నీరు కూడా తక్కువగానే అవసరం అవుతుండడంతో రైతులు ఎక్కువగా దృష్టి సారిస్తునారు. ము ఖ్యంగా డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నా రు. అధికారుల సూచనలు, సలహాలు పాటించడంతో అధి క దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పెరట్లోనే ఆ కుకూరలు పండిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి పంటలు సా గు చేస్తున్నారు. పండించిన కూరగాయలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌కు తీసుకెళ్లి విక్రయిస్తా రు. వంకాయలు మాత్రం హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తారు. కొత్తపేట, దాచక్‌పల్లి, టంకర, గుడ్డిమాల్కాపురం, హన్వాడ, సల్లోనిపల్లి, పెద్దదర్పల్లి, చిన్నదర్పల్లి గ్రామాల్లో ఎక్కువ శాతం కూరగాయలు పండిస్తారు. జిల్లా కేంద్రం స మీపంలో ఉండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.
ఏండ్లుగా కూరగాయల సాగు..
కొన్నేండ్ల నుంచి వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. ప్రస్తుతం వంకాయ, టమాటా, కాకర పండిస్తున్నాను. కూరగాయలను జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటాం. మార్కెట్లో ఎక్కువ శాతం మా మండలవాసులే కూరగాయలు అమ్ముతారు. కూరగాయల పంటలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతాం. మిగతా పంటలు తక్కువగా సాగు చేస్తాం.