స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడే తుది గడువు
మహబూబ్‌నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నేటితో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ముగింపు పడనున్నది. ఈ నెల 16 నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థా నాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనది. అయితే, వరుసగా ఐదు రోజులపాటు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కా లేదు. కాగా, సోమవారం ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇక నామినేషన్లకు చివరి రోజైన మంగళవారం ఉ దయం 11 గంటల తర్వాత అధికార పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 10 రెవెన్యూ డివిజన్లలో మొత్తం 1,445 మంది స్థా నిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 896 మంది ఎంపీటీసీలు, 82 మంది జెడ్పీటీసీలు, 451 మంది కౌన్సిలర్లు, 16 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నా రు. అత్యధికంగా మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధి లో 248 మంది ఓటర్లుండగా.. అత్యల్పంగా కొడంగల్ రెవె న్యూ డివిజన్ పరిధిలో 55 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందర్భంగా గుర్తులపై ఎన్నికైన వారిలో 1,039 మంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులున్నారు. కాంగ్రెస్ నుంచి 241, బీజేపీ నుంచి 119, ఇతరులు 46 మంది ఉన్నారు. అయితే, ఎన్నికల తర్వాత అనేక మంది ఎంపీటీసీ లు అధికార పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం ప్రతిపక్షాలకు అందనంత స్థాయిలో ఉన్నది. రెండు స్థానాల ఎన్నికలకు ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుందని అధికారులు తెలిపారు. అందులో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు అధికంగా వచ్చి న వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారు. రెవెన్యూ డివిజన్ కేం ద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఐదు జిల్లా కేంద్రాలతోపాటు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న షాద్‌నగర్, కొడంగల్‌లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, కౌంటింగ్ మాత్రం మహబూబ్‌నగర్‌లో ఉంటుంది. అధికార పార్టీ తరఫునే మెజారిటీ ఓటర్లు ఉండటంతో ప్రతిపక్షాలు పోటీకి జంకుతున్నాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించకపోవడం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే జనవరి 4న ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
గట్టు-2 ఎంపీటీసీ నామినేషన్..
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని ఎంపీటీసీ-2 సారబాయి కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఎంపీటీసీ లు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల తరఫున స్వతంత్ర అ భ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు ఉన్నారు. ఇది లా ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థులు నేడు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అధికార పార్టీ బీ ఫారాలతో నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26 వరకు ఉపసంహరణకు గడువు ఉండను న్నది. డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ ఉంటుంది.