ఎగువ మానేరు నీటి విడుదలపై హర్షం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
గంభీరావుపేట, జూన్ 22: మెట్ట ప్రాంతంలో ని చెరువులకు కాళేశ్వర జలాలు తరలివచ్చి దిగువకు మత్తడులు దుంకుతుండడం బంగారు తెలంగాణకు నిదర్శనమని ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ అన్నారు. మల్లారెడ్డిపేట లో పెద్దచెరువు గోదావరి జలాలతో మత్తడి దుంకడంతో మంగళవారం చెరువు వద్ద ప్రత్యేక పూజ లు చేశా రు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు రైతులతో కలిసి ఎంపీపీ, జడ్పీటీసీ పా లాభిషేకం చేసి మాట్లాడారు. ఎగువ మానేరు ఆ యకట్టు ఎడమ, కుడి కాలువల ద్వారా చెరువు లు నింపుకోవడంతో అపర భగీరథుడి సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ శెట్టి మహేశ్వరి, కొత్తపల్లి సింగిల్ విం డో చైర్మన్ భూపతి సురేందర్, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కమటం రాజేందర్, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు వెంకటస్వామిగౌడ్, ఉపసర్పంచ్ గాండ్ల ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్ దయాకర్‌రావు, నే తలు కొమిరిశెట్టి లక్ష్మన్, వంగ సురేందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, కమ్మరి రాజారాం, రా జు, శెట్టి రవి, హన్మాండ్లు, ఎగదండి స్వామి ఉన్నారు.
ముస్తాబాద్, జూన్ 22: ఎగువ మానేరు నీటి తో గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతుం డడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా ముస్తాబాద్‌లో, గూడెంలో మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎగువ మానేరు నీటిని ప్ర తి గ్రామానికి విడుదల చేయడం ఆనందంగా ఉం దని ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఆర్బీఎస్ క న్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు పేర్కొన్నారు. కా ర్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, స ర్పం చ్ గాండ్ల సుమతి, ఎంపీటీసీలు బాలకిషన్, శ్రీధ ర్, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, నా యకులు సాదుల్పాషా, ఎండి.సర్వర్‌పాషా, కొ మ్ము బాలయ్య, భరత్, దేవేందర్, ఉపసర్పంచ్ చాడ శ్రీనివాస్, పర్శరాములు, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఈడుగురాల్ల సంతోష్‌గౌడ్, పర్శరాములుగౌడ్, చోల మల్లేశ్‌యాదవ్, అన్వర్, నర్సింహారెడ్డి, స్వామి, మనోహర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.