ఆదాయాభివృద్ధిని పెంచేందుకు సెర్ప్ చేయూత
కులకచర్ల మండలంలో 1106 స్వయం సహాయక సంఘాలు
కులకచర్ల, జనవరి 17 : పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం సెర్ప్ ద్వారా వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నది. గ్రామాల్లో ఒక్కొ సంఘంలోని ఒక్కొక్క మహిళకు 50వేల నుంచి రెండు లక్షల వరకు కూడా వ్యక్తిగత రుణాన్ని అందజేస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఒక్కొక్కరిగా చేస్తున్న పనిని సామూహికంగా, గ్రూపుగా కూడా చేయ గలమని మహిళా సంఘాల్లోని సభ్యులు నిరూపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర వస్తు వులతో పాటు, వివిధ రకాల అవసరాలను గుర్తించి ఆయా గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు ఉపాధి లభించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా గ్రామాల్లో ఏ ఆదా యా భివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందో తెలుసుకోవడంతో పాటు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి సర్వేను నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు సెర్ప్ చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు కూడా పేదరికం నుంచి బయట పడు తా యని భావించి ప్రతి మహిళను సంఘాల్లో చేర్పిస్తున్నారు. వారికి బ్యాంకుల ద్వారా, ఎన్ ఆర్ఎల్ఎం ద్వారా, స్త్రీనిధి ద్వారా, గ్రామ సంఘాలు, మండల మహిళా సమాఖ్యల ద్వారా వారి కి కావలసి అవసరాలను ఏర్పాటు చేసుకునేందుకు రుణ సదుపాయాలను కల్పిస్తున్నది.
బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ వర్తించకపోవడంతో రుణాలు తీసు కునేందుకు మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. రుణాల వాయిదాలు తప్పకుండా చెల్లించడం వలన 98శాతం మేరకు రుణాలు రికవరీ అవుతున్నాయని సిబ్బంది తెలిపారు దీంతో మహిళా సంఘాల సభ్యులకు రూ. ఐదులక్షల నుంచి పదిలక్షల వరకు రుణా లు అందుతున్నాయి. కులకచర్ల మండలంలో 1106 స్వయం సహాయక సంఘాలు ఉం డగా అందులో 11060మంది సభ్యులు ఉన్నారు. 44 గ్రామ పంచాయతీలకు గాను 38 గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి మండలంలో వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రణా ళికలు తయారు చేసి అమలు పరుస్తున్నారు.
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం…
ప్రభుత్వం సెర్ప్ ద్వారా మహిళా సంఘాల్లో ఉన్న మాలాంటి వారు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందుతున్నాయి. మహిళా సంఘం ద్వారా రుణాలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకుంటున్నాం. ప్రతి నెల వాయిదా చెల్లించడం వలన తీసుకున్న అప్పు తీరిపోతుంది.
-వెంకటమ్మ, మహిళా సంఘం సభ్యురాలు, ఎంపీటీసీ ఘనాపూర్