డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి
ఆయా మండలాల్లో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మిడ్జిల్, నవంబర్ 15: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దోనూర్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
బాలానగర్, నవంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నేరళ్లపల్లిలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖలీల్, మండల కోఆప్షన్ సభ్యుడు జమీర్‌పాషా, రైతుబంధు సమితి మండల ఉపాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్, కాశన్న, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, నవంబర్ 15: మండలంలోని పెద్దఆదిరాల, కోడ్గల్, పోలేపల్లి గ్రామాల్లో సోమవారం బాదేపల్లి సహకార సంఘం సీఈవో యాదగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బాదేపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 ప్రకటించినట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే ముందు బాగా ఆరబెట్టి, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పి వైస్‌చైర్మన్ యాదయ్య, ఇన్చార్జి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచులు చేతనరెడ్డి, కృష్ణాబాయిరమేశ్, మమతానవీన్రెడ్డి, పీఏసీసీఎస్ డైరెక్టర్లు జీవన్గుండప్ప, లక్ష్మమ్మ, చంద్రయ్య, నర్సింహరెడ్డి, రామకృష్ణారెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొంగళి జంగయ్య, రఘుపతిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.