నేరేడుచర్ల, నవంబర్ 14 : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పీఏసీఎస్‌లు పని చేస్తున్నాయని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు. సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థ్ధానిక పీఏసీఎస్ ఎదుట సొసైటీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు అందజేసి అండగా నిలుస్తున్నారని అన్నారు. రైతు పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు విద్యా రుణాలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. సంఘం వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, సభ్యులు పోరెడ్డి పద్మ, దేవులపల్లి శంకరాచారి, తాళ్ల నరేశ్‌రెడ్డి, కట్టా సత్యనారాయణరెడ్డి, నూకల వెంకట్‌రెడ్డి, సఫావత్ బీక్యా, సీఈఓ దండేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్/ మేళ్లచెర్వు/ చింతలపాలెం : హుజూర్నగర్, మేళ్లచెర్వు, చింతలపాలెం పీఏసీఎస్ కార్యాలయంలో వారోత్సవాలు నిర్వహించారు. చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్, కాకునూరి శంభిరెడ్డి, వేములూరి రంగాచారి సొసైటీ జెండాను ఆవిష్కరించారు. హుజూర్నగర్ పీఏసీఎస్ వైస్‌చైర్మన్ మధుసూదన్, డైరెక్టర్లు లచ్చిరాం, శ్యామ్, శ్రీను, మల్లీశ్వరి, మల్లమ్మ, బ్రహ్మం, పద్మ, నరేందర్ మేళ్లచెర్వు పీఏసీఎస్ సీఈఓ గుమ్మిత వెంకట్‌రెడ్డి, చింతపాలెం పీఏసీఎస్ వైస్ చైర్మన్ షేక్ రిజ్వానా, డైరెక్టర్లు రామయ్య, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, కాశయ్య, బాలు, బాబు, సీఈఓ బాబురావు, ఏఈఓ రియాజ్ పాల్గొన్నారు.
కోదాడ టౌన్/ కోదాడ రూరల్/మునగాల/చిలుకూరు : కోదాడ పట్టణం, కాపుగల్లు, మునగాల మండలం తాడ్వాయి, కొక్కిరేణి, ఆకుపాముల, చిలుకూరు మండల కేంద్రాల్లోని పీఏసీఎస్ కార్యాలయాల్లో వారోత్సవాలు జరిగాయి. చైర్మన్లు ఆవుల రామారావు, నంబూరి సూర్యం, కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, చందా చంద్రయ్య, వల్లపురెడ్డి రామిరెడ్డి, అల్సకాని జనార్దన్ పాలకవర్గ సభ్యులతో కలిసి సొసైటీ జెండాను ఆవిష్కరించారు. సహకార సంఘాల ద్వారా అందిస్తున్న సేవలపై రైతులకు అవగాహన కల్పించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.