ప్రతిపాదనలు వెంటనే అందించాలి
పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలి
పాలమూరుకు తలమానికంగా నిలవాలి
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నవంబర్ 14 : మహబూబ్‌నగర్ మినీట్యాంక్ బండ్‌పై స స్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో టూరిజం ఎండీ మనోహర్, డీఈ రామకృష్ణ, సస్పెన్షన్ బ్రిడ్జి కాంట్రాక్టర్ పతాంజలితో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన త ర్వాత ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన పక్కా గా జరగాలని సూచించారు. మహబూబ్‌నగర్‌కు తలమానికంగా మినీట్యాంక్‌బండ్ రూపుదిద్దుకోనున్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే పక్కాగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాలమూరులో రోడ్ల విస్తరణతోపాటు, చౌరస్తాలు సుందరీకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.