భువనగిరి అర్బన్, నవంబర్ 13 : భువనగిరిలో శనివారం రెండోరోజు రాష్ట్రస్థాయి 5వ జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్-2021 పోటీలు కొనసాగాయి. రెండో క్వాలిఫై మ్యాచ్‌లను భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముకేశ్‌కుమార్, జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్‌గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. హాకీలో మెళకువలపై క్రీడాకారులకు అవగాహన కల్పించారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, భోజన సదుపాయాలను జిల్లా అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. న్యూ డైమెన్షన్ స్కూల్ మేనేజ్మెంట్ పులిమామిడి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా గ్రౌండ్, వసతి ఇచ్చారు. నమస్తే తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. క్రీడాపోటీల్లో రెండోరోజు ఉమ్మడి 10జిల్లాలు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని హాకీ జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కే.ధనుంజనేయులు, హాకీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ లచ్చు, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్‌లు, మేనేజర్లు, స్థానిక పీఈటీలు, హాకీ క్రీడాకారులు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.