వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయాలి
గ్రామ, మండలాల వారీగా ప్రకటించాలి
రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలి
కలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు
వనపర్తి, నవంబర్ 13 : కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా వందశాతం పూర్తి చేసి రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీ ర్ హరీశ్‌రావు అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్లతో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రభు త్వ దవాఖానల్లో వైద్య సేవలు, దవాఖానల నిర్వహణపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి ఒక కోటి వ్యాక్సిన్ డోసులను 165 రోజుల్లో, 2వ కోటి వ్యాక్సిన్ డోసులను 72 రోజుల్లో, 3వ కోటి వ్యాక్సిన్ డోసులను 27 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. ఇంకా కొవిడ్ ముప్పు తొలగిపోలేదని సింగపూర్, యూకే, రష్యా, చైనా దేశాలల్లో కేసులు పెరుగుతున్నాయని, కొన్ని దేశాలల్లో లాక్డౌన్ కొనసాగుతున్నదన్నారు. కొవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ చాలా ముఖ్యమని 18 ఏండ్లు నిం డిన ప్రతిఒక్కరికీ రెండు డోసులు ఇవ్వాల న్నారు. కొన్ని జిల్లాలో మొదటి డోసు 95 శా తం, కొన్ని జిల్లాలో 65 శాతం జరిగిందని, ఈనెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాలు, మండలాలు, జిల్లా వారీగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కలెక్టర్ ప్రకటించాలన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ప్రకటించిన గ్రామాలకు, మండలాలకు రాష్ట్రస్థాయి నుంచి ప్రత్యేక బృందాలను పంపించి తనిఖీ చేయిస్తామన్నారు. పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించి ప్రజల మ న్నలను పొందాలన్నారు. కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లును తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్లకు పూర్తిస్థాయి అధికారాలను ఇచ్చామని, దవాఖానల్లో ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలన్నారు. కలెక్టర్లు, సూపరింటెండెంట్లు దవాఖానల్లో ఉన్న వైద్య సదుపాయాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం పొందే లా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ల పర్యటన సమయంలో పీహెచ్సీ, సీహెచ్‌సీలు, జిల్లా దవాఖానలను ఆకస్మికంగా తనిఖీలు చేయాలన్నారు. దవాఖానల్లో ఉన్న ఎక్విప్మెంట్లు అన్ని సరిగా ప ని చేస్తున్నవి లేనిది రివ్యూ చేయాలన్నారు. ప్రభు త్వ దవాఖానల్లో ఎంత మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సర్జన్లు, ఉన్నారని, వారందరూ ప్రతి నెలా ఎన్ని ఆపరేషన్లు చేశారు, ఎంత మందికి వైద్య సేవలు అందించారో డాక్టర్ వారీగా, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది వారీగా రివ్యూ చేయాలని మం త్రి కలెక్టర్లకు సూచించారు. అన్ని పీహెచ్సీలో ఉ దయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని, ప్రభుత్వ దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంట ర్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య శ్రీ లో 964 రకాల, ఆయుష్మాన్ భారత్‌లో 646 కొత్తగా శస్త్ర వైద్య సేవలు చేయడానికి అవకాశం ఉందని, ప్రైవేట్ దవా ఖానల్లో లేవని మంత్రి స్పష్టం చేశారు.
మెడికల్ కళాశాల భవన నిర్మాణం పనులు డిసెంబర్ లోగా పూర్తి చేస్తాం
జిల్లాకు మంజూరైన నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం ప నులు డిసెంబర్ లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మంత్రికి వివరించారు. పట్టణంలో హాస్టల్ స్థల సేకరణ చేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ గురించి మాట్లాడు తూ 70శాతం పూర్తి చేసినట్లు, ఇంకా మిగిలిపోయిన వారిని వారం లోపు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, ఆశిస్ సంగ్వాన్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యనాయ క్, అదనపు డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, డీఎల్పీవో యాద య్య, డాకర్లు సౌభాగ్యలక్ష్మి, రవిశంకర్, రామాంజనేయులు, రామచందర్, రాజ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.