సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో బాధితులకు పరామర్శ
మోహినికుంటలో శుభకార్యానికి హాజరు
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 9 ( నమస్తే తెలంగాణ) ;బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ.. నేనున్నానంటూ అభయమిస్తూ ముందుకు సాగారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో శనివారం అమాత్యుడు ఆకస్మికంగా పర్యటించారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చేరుకొని ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం వర్షంలో తడుస్తూనే బాధితుల ఇండ్లకు వెళ్లి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.
ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. శనివారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఆకస్మికంగా పర్యటించారు. పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వర్షంలో తడుస్తూనే ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో పర్యటించా రు. మధ్యాహ్నం 12గంటలకు ముస్తాబాద్ మం డలం మోహినికుంటకు చేరుకున్నారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు మనుమడు సద్యోహిత్రావు బారసాల వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కాసేపు గడిపా రు. చిన్నారిని ఎత్తుకొని ముద్దాడారు. మోహినికుంట సర్పంచ్, తన చిన్నమ్మ వనజతో మాట్లాడి గ్రామాభివృద్ధి గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు ఆవునూరుకు చేరుకొని జడ్పీటీసీ గండం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. 2:30గంటలకు కొండాపూర్‌కు వెళ్లి తన పీఏ మహేందర్‌రెడ్డి సోదరుడు ఇటీవల మృతి చెందగా పరామర్శించి ఓదార్చారు. గంభీరావుపేటలో పార్టీ నేత లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి తల్లి, ముస్తఫానగర్‌లో సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్ కొడుకు సిద్ధార్థ మరణించగా వారిని పరామర్శించి అండగా ఉంటానని అభయమిచ్చారు. సిద్ధార్థ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ ఆపద లో ఉన్న నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఎళ్లప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. కాగా, ఆయనను కలిసి పలువురు పార్టీ కమిటీల బాధ్యులను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అలా గే మోహినికుంటలో సిరిసిల్లకు చెంది న పలువురు నేత కార్మికులు, ఆసాములు కేటీఆర్‌ను కలి సి సమస్యలను వివరించారు. బతుకమ్మ చీరెల బకాయిలు 50కోట్లు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.
బాలుడి చికిత్సకు భరోసా..
బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గంభీరావుపేటకు చెందిన సిద్ధార్థ్‌కు మెరుగైన చికిత్స చేయిస్తానని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. శనివారం గంభీరావుపేట పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను సిద్ధార్థ తల్లిదండ్రులు కలిశారు. వారి కొడుకు పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన అమాత్యుడు రామన్న బాలుడిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకురావాలని సూచించారు. కాగా, అడిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకువచ్చిన మంత్రికి బాలుడి తల్లిదండ్రు లు కృతజ్ఞతలు తెలిపారు.
వెభవంగా నిర్వహించాలి
శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పాలకవర్గ సభ్యులకు సూచించారు. నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, పోచ మ్మ, శ్రీ శివసాయిబాబా, శ్రీ విశ్వనాథస్వామి ఆలయాల చైర్మన్లు, ధర్మకర్తలు శనివారం ముస్తాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వానప్రతులను మంత్రి ఆవిష్కరించారు. కాగా ఈ నెల 20న జరిగే రథోత్సవానికి హాజరవుతానని చెప్పారు. కార్యక్రమా ల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఎంపీపీలు జనగామ శరత్‌రావు, వంగ కరుణ, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్ రా వు, గుండం నర్సయ్య, కొమిరిశెట్టి విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు కొమిరె సంజీవ్‌గౌడ్, ఈవో నాగారపు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాపాగారి వెంకటస్వామిగౌడ్, భూంపల్లి సురేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్లు జానాబాయి, సుతారి బాలవ్వ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్లు అల్లాడి రమేశ్, విజయరామారావు, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పీ కో ఆప్షన్ హైమద్, ఆర్బీఎస్ కన్వీనర్లు రాజేందర్, గోపాల్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, మహబూబ్అలీ, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, నారాయణరావు, కొమ్ము బాల య్య, సర్వర్‌పాషా, బత్తుల అంజయ్య, అంజిరెడ్డి, నర్సింహారెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు సం దుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోచిరెడ్డి, నక్కదాస రవి, మేరుగు యాదగిరిగౌడ్, రాజేశంగౌడ్, ఆలయ కమిటీల చైర్మన్లు ఉప్పల విఠల్‌రెడ్డి, వాసుదేవరాయలు, సిరిగిరి మురళి, మామిడాల కృష్ణ, ధర్మకర్తలు పాల్గొన్నారు.