సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
రూ.2.44 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నర్సంపేట, సెప్టెంబర్ 9 : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా సాయమందిస్తూ సీఎం కేసీఆర్ మేనమామలా అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేట ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు రూ.2.44 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సంక్షేమ పథకాల అమలులో తె లంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని అ న్నారు. త్వరలో సంక్షేమ పథకాలపై న ర్సంపేట నియోజకవర్గంలో స్పెషల్ డ్రై వ్ చేయబోతున్నామన్నారు. త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులతో స మావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీలకు కో టాలు, వాటాలు లేకుండా కల్యాణల క్ష్మి, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను కరోనా క్లిష్ట సమయంలో నూ అమలు చేస్తున్నారనన్నారు. దేశం గర్వించదగ్గ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సకాలంలో చెక్కులు రావడానికి సహకరిస్తున్న ఆర్డీవో, సిబ్బందికి కృజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం..
నర్సంపేట రూరల్ : కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. గురువారం మండలంలోని గురిజాల, మహేశ్వరం, మాదన్నపేట, ఇటుకాలపల్లి, జీజీఆర్ప ల్లి, లక్నేపల్లి గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎంపీపీ కళావతి క ల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీటీసీలు బండారు శ్రీలత, భూక్యా వీరన్న, ఉల్లేరావు రజిత, సర్పంచ్‌లు గొడిశాల మమత, మండల రవీందర్, తుత్తూరు కోమల, గొడిశాల రాంబా బు, వీఆర్వోలు పాల్గొన్నారు. మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్ గోలి శ్రీనివాస్‌రెడ్డి పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.