
నర్సాపూర్, నవంబర్ 8: పోడు భూములకు సంబంధించిన అంశంపై 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని కాగజ్ మద్దూర్‌లో సోమవారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో ఫారెస్ట్రైట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీ ట్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోడు భూములను పట్టాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఈ కమిటీని ఏర్పా టు చేస్తున్నామని వెల్లడించారు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు ఫారెస్ట్ భూమిలో పంట పండించుకునే వారు దరఖాస్తు చేసు కుంటే ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చే అవకాశం ఉం దని తెలిపారు. దరఖాస్తు పె ట్టుకున్న తర్వాత ఈ కమి టీ పరిశీలిస్తున్నదని తెలిపారు. కాగజ్మద్దూ ర్ గ్రామం పెద్దమ్మ తండాలో 5 ఎకరాల పోడు భూమిని గుర్తిం చామని తెలియజేశారు. కమిటీలో జాట్రోత్ రవిని చైర్మన్‌గా, మ న్మదరెడ్డిని సెక్రటరీగా గ్రామసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొల్చారంలో..
కొల్చారం, నవంబర్ 8: కొల్చారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం పోడు భూములపై ఫారెస్టు అధికారి శారద అవగాహన కల్పించారు. ఎవరైతే అటవీభూములను సాగు చేసుకున్నప్పటికీ పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునేందుకు కమిటీ వేస్తున్నామన్నారు. అటవీభూములను సాగు చేసుకుంటున్నవారు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి విచారణ అనంతరం హక్కులు కల్పిస్తామన్నామని తెలిపారు. ఈ సందర్భంగా సుమారుగా 20 మంది దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్, కారోబార్ ప్రభాకర్ పాల్గొన్నారు.