జగిత్యాల జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్
ఎమ్మెల్యే సంజయ్ చేతుల మీదుగా ప్రారంభం
సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్, మే 6: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం.. సం పూర్ణ ఆర్యోగమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభు త్వం వేలాది రూ పాయల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉ చితంగా చేయాలని సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలో వైద్య, ఆరోగ్య కార్యాలయం ప క్కన ఏర్పాటు చేయగా, గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డయాగ్నోస్టిక్ సెంటర్లో థైరాయిడ్, ప్రొఫైల్ ఐ,టి, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీబీపీ, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, సిరం ఎలక్ట్రోలైట్స్, పాథాలజీ పరీక్షలు, మైక్రో బయాలజీ లాంటి 57రకాల పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పేషంట్ల నుంచి నమూనాలు సేకరించి, ఇక్కడికి పంపిస్తారని, పరీక్షించి 24గంటల్లో ఆన్లైన్ ద్వారా రిపోర్టు ఇస్తారని చెప్పారు. ఈ సేవలన్నీ ఉచితమని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో మాధురి, డీఎంహెచ్ఓ పుప్పాల శ్రీధర్, టీ హబ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సమీయొద్దీన్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి శ్రీపతి, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ నందిత, డీపీవో స్వామి, టీ హబ్ మేనేజర్ నివ్య ఉన్నారు.