సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో నీలివిప్లవం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
మాదన్నపేట చెరువులో 1.37లక్షల చేప పిల్లల విడుదల
బాధిత కుటుంబానికి రూ.4లక్షల విలువైన ఎల్వోసీ అందజేత
టీఆర్ఎస్ పాలనను చూసే భారీగా వలసలు
దుగ్గొండిలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, బీజేపీ నాయకులు
నర్సంపేట రూరల్, అక్టోబర్ 3 : మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పోసిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను విడుదల ఆదివారం విడుదల చేశారు. తొలుత చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదన్నపేట చెరువులో లక్షా37వేల చేప పిల్లలు పోశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో నీలి విప్లవానికి నాంది పడిందన్నారు. వరంగల్ జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఫిషరీస్ డిపార్టుమెంట్ అధికారికంగా గుర్తించిన మత్స్యకారుల సంఖ్య 6,600 మంది పైచిలుకు ఉందన్నారు. పాలకవర్గం ఒప్పుకుంటే కొత్త సభ్యత్వాలు ఇవ్వొచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు కేసీసీ కార్డు ఇవ్వాలని నిర్ణయించిందని, దీని ద్వారా గుంట భూమిలేని మత్స్యకారులు దాదాపు రూ.50వేల రుణం ఎలాంటి జమానతు లేకుండా పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. దిగుమతి చేసేకునే స్థాయి నుంచి చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, రాయిడి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, ఎంపీటీసీ భూక్యా వీరన్న, గుంటి కిషన్, నాగెశెట్టి ప్రసాద్, భీరం సంజీవరెడ్డి, దేవోజు సదానందం, జర్రు రాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు జినుకల నర్సయ్య, మారపాక నర్సయ్య, నాయకులు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, రంజిత్, రమేశ్, రాజు, బాబు, సాంబయ్య పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత..
నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాంజీపేట గ్రామానికి చెందిన వినీత్‌కు వైద్య ఖర్చుల కోసం రూ.4లక్షల విలువైన ఎల్వోసీ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీల ద్వారా వైద్య సేవలు పొందవచ్చన్నారు. టీఆర్ఎస్ నాయకులు జున్నుతుల మహేందర్‌రెడ్డి, మురారి రవి, గంధం జగన్మోహన్రావు పాల్గొన్నారు.
ఏవీఆర్ సహకార వారధి..
దివంగత మాజీ ఎమ్మెల్యే అర్శనపెల్లి వెంకటేశ్వరరావు (ఏవీఆర్) సహకార వారధి అని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ముగ్ధుంపురం గ్రామ శ్రీరామ రైతు విత్తన ఉత్పత్తిదారుల పరస్పర సహకార పరపతి సంఘంలో ఏవీఆర్ 12వ వర్ధంతి నిర్వహించారు. సంఘం ఆవరణలోని ఏవీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు కూలీలకు ఎనలేని సేవ చేసిన మానవతావాది ఏవీఆర్ అని కొనియాడారు. ఆయన ముందు చూపుతోనే సహకార సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిటీ చైర్మన్ బానోత్ సంగూలాల్, చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మాజీ అధ్యక్షుడు రాధారపు సాంబరెడ్డి, పాలకవర్గ సభ్యులు మాధవరావు, గోపు జైపాల్‌రెడ్డి, రాజేశ్వరరావు, సిద్ద సుధాకర్, నాంపెల్లి సాంబయ్య, చల్లా మల్లారెడ్డి, గుర్రాల నర్సింహారెడ్డి, నామాల సత్యనారాయణ, బోయినపల్లి పాపారావు, నామల నరేశ్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, బాల్నె వెంకన్న, గుంటుక సోమయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు..
దుగ్గొండి : సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై మండలంలోని చాపలబండ ఎంపీటీసీ పిండి కుమారస్వామి, అడవిరంగాపురం, గిర్నిబావి సర్పంచ్‌లు కొడం రమాదేవి, కూస సమత, బీజేపీ నాయకుడు బుస్సాని రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కనిష్క ఫంక్షన్హాల్లో మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రెండు నెలల్లో సీఎం కేసీఆర్‌ను నర్సంపేటకు తీసుకువచ్చి ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు నర్సంపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్లు ఊరటి మహిపాల్‌రెడ్డి, నాయకులు బీరం సంజీవరెడ్డి, శానబోయిన రాజ్‌కుమార్, పొన్నం మొగిలి, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, ముదురుకోళ్ల శారదాకృష్ణ. లింగంపల్లి రవీందర్రావు, గుండెకారి రంగారావు, శంకేసి కమలాకర్, మేరుగు రాంబాబు. జక్క అశోక్, రమేశ్‌యాదవ్, ఆకుల రమేశ్, బొమ్మగాని వెంకన్న, బండి జగన్, ఇమ్మడి యుగేంధర్, ఏడెల్లి ఉమేశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.