కొత్త పురపాలక చట్టంతో పకడ్బందీ వ్యవస్థ
సెగ్రిగేషన్ సిస్టమ్‌లో దేశానికే సూర్యాపేట ఆదర్శం
పట్టణ ప్రగతి అవగాహన సమావేశంలో
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
బొడ్రాయిబజార్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేటి నుంచి చేపట్టనున్న పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం పట్టణంలోని 15, 31, 32, 33, 45, 46 వార్డుల్లో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలు గుర్తెరిగి అతి తక్కువ సమయంలో అద్భుతమైన అభివృద్ధ్ది చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాక ముందు మొక్కలు నాటడమంటే తెలియదని అలాంటిది హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నడుస్తుందన్నారు. రోడ్డుకు రెండు వైపులా చెట్లున్న రాష్ట్రం తెలంగాణ అని లారీ డ్రైవర్లు మాట్లాడుతున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలో వీధులు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలంతా తమ సలహాలు, సూచనలు కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు తెలుపాలన్నారు. సమావేశాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు గండూరి పావనీకృపాకర్, కొండపల్లి నిఖిలాదిలీప్రెడ్డి, జహీర్, ఎల్మినేటి అభినయ్, భద్రమ్మ పాల్గొన్నారు.
సబ్సిడీ వాహనం అందజేత
సూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ముదిరాజ్ మహిళ కంటు రూపకు రాష్ట్ర ప్రభుత్వ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఆర్థ్ధిక సహకారంతో సుమారు రూ.10 లక్షల విలువగల సంచార చేపల విక్రయ వాహనాన్ని జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు బీరవోలు రవీందర్ రెడ్డి, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన టీఎన్జీఓ నాయకులు
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ల్యాండ్ అండ్ సర్వే ఏడీగా శ్రీనివాసులు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీఓ నాయకులు దున్న శ్యామ్, శ్రావణ్ కుమార్, నర్సింహాచారి, కిరణ్ కుమార్, మేడి జయరావ్, గామయ్య, చిన శ్రీరాములు పాల్గొన్నారు.