సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి?
Ratha Saptami 2022 | దినకరుడు దిగంతాలను వెలిగిస్తాడు. ప్రభాకరుడు ప్రభవించడంతోనే చీకట్లు తొలిగిపోతాయి. వెలుగు రేఖలు ప్రసరిస్తాయి. ఆయన రాకతోనే మాను, చేను అన్నీ వికసిస్తాయి. గూటిలోని గువ్వకు, గుడిసెలోని అవ్వకు అందరికీ ఆయన ఆత్మబంధువు. ప్రాణికోటికి ప్రాణాధారమైన ఉష్ణాన్ని అందించే ఆదిత్యుడు అందరివాడు. రథ సప్తమి మొదలు నానాటికీ తన తీక్షణతను పెంచుతూ ప్రకృతి సమతౌల్యతను కాపాడతాడు. ఉప్పు నీటిని పుక్కిట పట్టి, మేఘాలను పుట్టించి, దట్టించి వర్షాలు కురిపిస్తాడు. మనిషి మనుగడకు కారణభూతుడైన ప్రత్యక్ష నారాయణస్వామిని మనసారా కొలుద్దాం.
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని పురాణ వచనం. సూర్యోదయం కాగానే దట్టమైన కాంతి కిరణాలు కరుణామృత వర్షంలా ఇలపై పరుచుకుంటాయి. లోకాలను మేలుకొలుపుతాయి. బాలభానుని దర్శనంతో ఉదయగిరి పర్వతాలకు చెందిన ధాతు సంపత్తి ఎర్రని నీటి ప్రవాహంతో కప్పేసినట్లు కనిపిస్తుంది. అంతగొప్పగా ఉండే సూర్యరశ్మి శరీరంలోని అణువణువునూ ప్రభావితం చేస్తుంది. శరీర పోషణకు అవసరమైన విటమిన్ ‘డి’ని సమృద్ధిగా అందిస్తుంది. యోగ శాస్త్రం సూచించిన సూర్య నమస్కారాల ఉద్దేశం కూడా ఇదే!
నమస్కార ప్రియుడు
సూర్యోపాసనలో ముఖ్యమైన అంశం సూర్య నమస్కారాలు. ‘నమస్కార ప్రియో భానుః అభిషేక ప్రియో శివః’ అంటుంది వేదం. అంటే పరమ శివుడు అభిషేక ప్రియుడైతే.. సూర్యుడు నమస్కార ప్రియుడన్నమాట. సూర్యోదయ సమయంలో.. భానుడి కిరణాలు శరీరానికి తాకే విధంగా చేసే యోగాసనాలు మనసును, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. సూర్య భగవానుడి ఆరాధనలో విశేషమైనది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం. రావణుడితో యుద్ధం చేస్తూ అలసిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడట. త్రికరణ శుద్ధితో సూర్యుణ్ని ఉపాసించిన రాముడు మనోబల సంపన్నుడై.. రణంలో రావణుడిని సంహరించాడు.
భానో భాస్కర మార్తాండ చండరశ్మే దివాకర
ఆరోగ్యమాయుర్విజయం శ్రియః మోక్షంచ దేహిమే॥
అనే సూర్య మంత్రాన్ని సాధన చేయడం ద్వారా ఆరోగ్యం, ఆయుర్దాయం, విజయం, మేధాశక్తి
కలుగుతాయని పెద్దల మాట.
– శ్రీ
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

