Maha Shivaratri 2023 | శివరాత్రి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి
Maha Shivaratri 2023 | శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నదీ ఇదే రోజు. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని, తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే.
Maha Shivaratri 2023 | శివరాత్రి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి?
– ఎస్. ప్రద్యుమ్న, హైదరాబాద్
శివరాత్రి వ్రతం హ్యేతత్ కరిష్యేహం మహా ఫలం
నిర్విఘ్నం కురుమేదేవాత్ర త్వప్రసాదాజ్జగత్పతే॥
‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ ఉండుమ’ని శివుణ్ని వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్ర వచనం.
శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నదీ ఇదే రోజు. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని, తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివర్రాతి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం, శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఉపవాస నియమం అందరికీ మేలు చేస్తుంది. మాఘమాసం వరకూ మందగించి ఉండే జీర్ణవ్యవస్థ, వేసవి రాకతో తీవ్రం అవుతుంది. శీతకాలం, వేసవి సంధికాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెబుతారు.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
“Maha shivaratri 2023 | సంతాన ప్రాప్తి కోసం శంకరుడిని ఏ పూలతో పూజించాలి?”
“MahaShivaratri Special | మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.”
“Maha Shivaratri | తెలంగాణలోని ఈ క్షేత్రాలు మహాశివరాత్రి వేడుకలకు ఎంతో ఫేమస్ !”
Maha Shivaratri | ఇద్దరు కవుల ముద్దుల శివుడు.. పాలకుర్తి సోమేశ్వరుడి మహాత్మ్యమిదీ..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

