ఉన్నది ఉన్నట్టుగా!
అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోని వారెవరు? అది మన ముఖాన్ని అచ్చుగుద్దినట్లు ఉన్నది ఉన్నట్లు చూపుతుంది. మనలోపాలను యథాతథంగా చూపుతుంది. అద్దం కిందపడి ముక్కలైనా ప్రతి ముక్కలోనూ నిజమే కనిపిస్తుంది తప్ప లేనిది కనిపించదు.
అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోని వారెవరు? అది మన ముఖాన్ని అచ్చుగుద్దినట్లు ఉన్నది ఉన్నట్లు చూపుతుంది. మనలోపాలను యథాతథంగా చూపుతుంది. అద్దం కిందపడి ముక్కలైనా ప్రతి ముక్కలోనూ నిజమే కనిపిస్తుంది తప్ప లేనిది కనిపించదు. అందుకే ప్రవక్త (స) ‘ఒక విశ్వాసి మరో విశ్వాస సోదరునికి అద్దంలాంటివాడు’ అన్నారు. సగటు ముస్లిం అద్దంలా ఎప్పుడూ సత్యమే పలకాలన్నది ప్రవక్త ఉద్బోధ. నిజాన్ని నిర్భీతిగా చెప్పాలి. మంచికి ప్రతిబింబంగా మారాలి.
ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడటం విశ్వాసికి శోభించదు. చేదుగా అనిపించినా సత్యమే పలకాలని ప్రవక్త (స) బోధ. నిజం చెప్పడం వల్ల మొదట్లో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా.. అంతిమంగా మన వ్యక్తిత్వం వికసిస్తుంది. దానికి భిన్నంగా చీటికీమాటికీ అబద్ధాలు చెబుతూ తిరిగేవారి వ్యక్తిత్వానికి మాయని మచ్చ ఏర్పడుతుంది. అందుకే సత్యం పలకడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. అప్పుడు అల్లాహ్ దగ్గర మన పేరు సత్యసంధుల జాబితాలో చేరుతుంది. అందుకే అబద్ధానికి ఆమడ దూరంలో ఉండాలని బోధించారు ప్రవక్త.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Mirror
- mirror selfie
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

