హైదరాబాద్ : భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారదర్శనం నుంచి సోమవారం భక్తులను అనుగ్రహించనున్నారు. రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఆలయ అధికారులు టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తుల కోసం 2లక్షల లడ్డూ ప్రసాదాలను అధికారులు సిద్ధం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తరలివచే అవకాశం ఉండడంతో అధికారులు సోమవారం వరకు నిత్య కల్యాణ వేడుకలను నిలిపివేశారు.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 23 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ బందోబస్తు కల్పించారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తుండడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి తెప్పోత్సవం జరుగనున్నది. హంసవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.