రేపటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనున్నది. ఈ మెట్లోత్సవం రేపటి నుంచి మూడు రోజులపాటు కొనసాగుతాయి. తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక ఉన్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో...
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనున్నది. ఈ మెట్లోత్సవం రేపటి నుంచి మూడు రోజులపాటు కొనసాగుతాయి. తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక ఉన్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు.
ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 8.30 నుంచి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన మండళ్లు సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
మెట్లోత్సవం తొలి రోజున సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశాలు ఉంటాయి. మెట్లోత్సవం చివరి రోజున ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు.
అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని దర్శించుకుంటారు. వేంకటాద్రి పర్వతాన్ని ఎందరో కాలినడకన అధిరోహించి స్వామి అనుగ్రహం పొందిన వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు ఈ మెట్లోత్సవం కార్యక్రమం చేపడుతున్నది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

