శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. అలాగే గర్భాలయంలో అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చనలను సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. సామూహిక అభిషేక సేవాకర్తలకు సైతం స్వామివారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాలు కల్పించనున్నట్లు వివరించారు.