Sri Rama Navami | నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్యాణం చేయాలని శాస్త్ర వచనం. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.