కొల్లాపూర్: ప్రకృతిని పూజించడంలో భారతీయ జీవన విధానంలో దాగి ఉన్న అంశం. అందుకే భారతదేశంలో జరిగే ప్రతి పండుగ ప్రతి ఉత్సవంలో, ప్రతి కార్యంలో పకృతిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో విజయదశమి (Vijaya Dashami) ఉత్సవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. శిలాయుగంలో పనిముట్ల వాడకం ప్రారంభంతోనే మానవ వృద్ధిలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే జీవన విధానాల్లో మన పూర్వీకులు పనిముట్ల ఆరాధన (Ayudha Puja) భాగంగా చేశారు.
ఆయుధ పూజా లేదా శాస్త్ర పూజ కార్యక్రమాలు నిర్వహించడం హిందూ పండుగలోని విజయదశమి ఉత్సవాలలో నిర్వహిస్తారు. ముఖ్యంగా విజయదశమికి ముందు రోజు అయిన నవమి నాడు ఆయుధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం మొదలు ముగింపు వరకు స్త్రీ దేవతార్చన జరుగుతుంది. నవరాత్రులలో దుర్గాదేవి వివిధ రూపాలలో పూజలను అందుకోవడం కూడా ఎంతో ప్రత్యేకమైన ఆచారంగా చెప్పవచ్చు. స్త్రీ శక్తి సామర్ధ్యాలు లోకానికి తెలియజేసే విధంగా విజయదశ ఉత్సవాలు కొనసాగుతాయి. దశమి ముందు రోజు జ్ఞానం, ధనం, శక్తి ప్రతిరూపాలైన సరస్వతి దేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవిలు ఒకేరోజు పూజలు అందుకుంటారు. అందుకే నవమి నాడు ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరు తమ పనిముట్లను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపడతారు. ఆయుధం అంటే విభిన్నార్థాలు వచ్చినా.. మన నిత్య జీవితంలో మనకు జీవనాధారంగా ఉండే ప్రతి వస్తువును పూజించడం ఆచారంగా మారింది.
విజయదశమినగా చెడుపై మంచి సాధించిన విజయంగా పురాణాలు చెపుతున్నాయి. పూర్వం రాక్షసుడైన మహిసాసురుడు నిత్యం ప్రజలతో పాటు దేవత మూర్తులను కూడా వేధించేవాడు. మహిసాసుడిని ఎదుర్కొన్నే శక్తి ప్రజలతో పాటు సమస్త దేవత మూర్తులు కూడా సాధ్యం కాలేదు. అయితే దుర్గాదేవి లోక కళ్యాణం కోసం 8 రోజులు పాటు యుద్ధం చేసినా మహిసాసురుడు అంతం కాలేదు. దీంతో తొమ్మిదో రోజు అయిన నవమినాడు దుర్గాదేవి ఆయుధాలకు పూజలు నిర్వహించి దశమి రోజున మహిసాసురుడితో జరిగిన భీకరమైన యుద్ధంలో అతడిని సంహరించింది. మహిషాసురుడిని సంహరించిన రోజు అంటే విజయదశమి జరుపుకునే ఒకరోజు ముందు ఆయుధాలకు పూజలు చేయడం ఆచారంగా వస్తుంది.