తిరుమల : ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శనివారుం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగేణేంద్ర తీర్థ స్వామీజీ తన శిష్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు ఆయన రాక సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆలయ మర్యాదలు చేశారు. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ అధికారులు, రుత్వికులు సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయనకు ఆలయ డీఈఓ రమేష్ స్వాగతం పలికారు. వీజీఓ బాలిరెడ్డి, పీష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, మళ్లీ మళ్లీ వస్తుంటానని శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ చెప్పారు. తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, సిబ్బందికి అభినందించారు.