‘ఆయన’ అనే పేరు వినిపిస్తుంది. నిత్యం ఏదో ఒక నగరంలో అజాన్ (ప్రార్థన కోసం పిలుపు)లో ఆయన పేరు లేకుండా పూర్తికాదు. శుక్రవారం ప్రార్థనలు, ఈద్ ప్రార్థనలు లేదా వివాహాల కోసం ఇచ్చే ఉపన్యాసాలు ఆ పవిత్ర నామం తీసుకోకుండా పూర్తి కావు. ఆయనెవరో కాదు ముస్లింలు ప్రాణానికి మిన్నగా ప్రేమించే ముహమ్మద్ ప్రవక్త (స).
ఆయన బోధనలు సదా స్మరణీయాలు. అజ్ఞానాంధకారంలోని ప్రపంచానికి కొత్త వెలుగులను ప్రసాదించిన మహనీయుడు ప్రవక్త ముహమ్మద్ (స). ఆయన మానవాళికి సాఫల్య మార్గం చూపించారు. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా మానవ సమాజానికి మార్గ దర్శనం చేశారు. సత్య, ధర్మాల గురించి తెలుసుకోవాలంటే ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణాత్మక జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవాలి.
తన కన్నా ముందు ఉన్న ప్రవక్తలు తీసుకొచ్చిన ఆధ్యాత్మిక సందేశానికి ఆయన ముగింపును ఇచ్చారు. మనుషుల సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, అంతర్గత, బాహ్య ఆచరణలను చక్కదిద్దారు. అన్ని రంగాలు, వ్యవస్థల్లో సంస్కరణలను తీసుకొచ్చారు. మానవ సమాజాన్ని సంస్కరించి మానవత్వ విలువలను పునరుద్ధరించారు.
సమ సమాజ నిర్మాణం ఆయన ధ్యేయం. ఆర్థిక పతనం కాకుండా సమాజాన్ని కాపాడటం ఆయన స్థాపించిన ఇస్లాం ప్రధాన ఉద్దేశం. ముహమ్మద్ (స) జీవితాన్ని మనం సరిగా అవగాహన చేసుకొని, ఆయన బోధనలను ఆచరించినప్పుడే జీవితంలో విజయం సాధించగలుగుతాం. అశాంతి, స్వార్థం, నైతిక విలువల పతనం నెలకొన్న నేటి సమాజంలో ఆయన బోధనలు ఆచరించడం తక్షణావసరం.
– ముహమ్మద్ ముజాహిద్
96406 22076