అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం సాయంత్రం తిరుమల(Tirumala) కు కాలినడకన బయలుదేరారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే . 11 రోజుల పాటు దీక్ష అనంతరం తిరుమల సన్నిధిలో దీక్ష విరమణకు ఆయన పూనుకున్నారు.
ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అలిపిరి(Alipiri) కి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుమలకు కాలినడకన వెళ్తున్న సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. బుధవారంనాడు డిప్యూటీ సీఎం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు.