ఉగ్రమూర్తి.. మంత్రకీర్తి..
ప్రహ్లాదుడిని కాపాడటం కోసం అవతరించిన మూర్తి నరసింహస్వామి. అలా వచ్చి.. ఇలా రాక్షస సంహారం చేసిన ఆ నరకేసరి కేవలం ఉగ్రమూర్తి మాత్రమే కాదు.. మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.
- ఈ నెల 11న నరసింహ జయంతి
ప్రహ్లాదుడిని కాపాడటం కోసం అవతరించిన మూర్తి నరసింహస్వామి. అలా వచ్చి.. ఇలా రాక్షస సంహారం చేసిన ఆ నరకేసరి కేవలం ఉగ్రమూర్తి మాత్రమే కాదు.. మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యం మృత్యుం నమామ్యహం॥
నరసింహుడి నామ రూపంలో ఉన్న మంత్రం ఇది. ఇందులో ఉన్న ఒక్కొక్క నామం స్వామి ఒక్కో తత్త్వాన్ని ప్రకటిస్తుంది. ఉగ్రం: స్వామి ఉగ్రమూర్తి. ఈ ఉగ్రత్వమే సకల లోకాలనూ పాలిస్తుంది. నరసింహుడి హుంకారాన్ని విన్నంత మాత్రాన అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం: సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహస్వామి వీరమూర్తి. సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. మహావిష్ణుం: అన్నిలోకాల్లో, అంతటా ఉండే నరసింహ తత్త్వానికి ఈ నామం ప్రతీక. సకల ప్రపంచంలోని జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు. నరసింహ తత్త్వంలోని మరొక విశేషం ఇది. జ్వలంతం: ఈ నామం నరసింహుడిలోని యోగ తత్తాన్ని తెలియజేస్తుంది. సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయటం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన నరసింహ తత్త్వమే ‘జ్వలంతం’ శబ్దానికి అర్థం. సర్వతోముఖం: ఇంద్రియ సాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం. నరసింహుడు సర్వతోముఖుడు. సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ, ఆ తర్వాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్త్వమే సర్వతోముఖత్వం.
నృసింహం: సకల జంతుజాలంలో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించటానికి శ్రేష్ఠమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు. సింహం పర్వతగుహల్లో నివసిస్తుంది. భక్తుల హృదయగుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు. ఇదీ నరసింహతత్త్వం. భీషణం: నరసింహుడి శాసన శక్తికి ప్రతీక భీషణత్వం. సూర్యచంద్రాదుల ప్రకాశకత్వం, అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుడి భీషణశక్తి కారణంగా నడుస్తున్నాయి. అత్యంత భయంకరమైన స్వరూపం ఇది. భద్రం: భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే, ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. అదే భద్రత్వం. నరసింహ తత్త్వంలోని మరో కోణానికి ప్రతీక ఇది. తనను శరణు వేడిన వారికి భద్రతను కల్పిస్తాడు స్వామి. మృత్యుం మృత్యుం: నామ స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు స్వామి. అందుకే మృత్యువుకే మృత్యువు అన్నారు. స్వాత్మ స్థితిని కలుగజేసి, అమృతత్త్వాన్ని కలుగజేసే స్వరూపం ఆయన.
…? శ్రీ భారతి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

