నాగేటి సాల్లల్ల ఉయ్యాలో..
సీతమ్మా పుట్టింది ఉయ్యాలో..
జనకమారాజింట ఉయ్యాలో..
పెరిగింది సీతమ్మ ఉయ్యాలో
పెరిగినా సీతమ్మ ఉయ్యాలో..
పెళ్లిళ్లు గోరింది ఉయ్యాలో..
ఏడిండ్ల సందునా ఉయ్యాలో..
ఎలబద్రి చెట్టుంది ఉయ్యాలో..
ఆ ఎలబద్రి చెట్టుకూ ఉయ్యాలో..
ఏడే మొగ్గలూ ఉయ్యాలో..
ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో..
తక్కెడూ అయ్యింది ఉయ్యాలో..
ఆ తక్కెడూ పత్తికీ ఉయ్యాలో..
వొక్కటే ఏకుంది ఉయ్యాలో..
ముసలోళ్లు వడికిరీ ఉయ్యాలో
ముత్యాల పోగు ఉయ్యాలో..
పడుసోళ్లు వడికీరి ఉయ్యాలో..
పగడాల పోగు ఉయ్యాలో..
ఆ పోగు ఈ పోగు ఉయ్యాలో..
కలె పడుగు జుట్టిందీ ఉయ్యాలో..
చింతకింది శాలయ్య ఉయ్యాలో..
చీరె నెయ్యవయ్య ఉయ్యాలో..
నేసెనే శాలయ్య ఉయ్యాలో..
నెలకొక్క గజమునూ ఉయ్యాలో..
అంచుకు ఏసిండ్రు ఉయ్యాలో..
అర్ధనాల పోగు ఉయ్యాలో..
కొంగుకూ ఏసిండ్రు ఉయ్యాలో..
బంగారు ఆ పోగు ఉయ్యాలో..
ఆ సీర నైతేనే ఉయ్యాలో..
సీతమ్మా మెచ్చెనే ఉయ్యాలో..
సీతమ్మా మెచ్చిన సీర ఉయ్యాలో..
సీతమ్మా కట్టిందే ఉయ్యాలో.. ॥
సీతమ్మా ॥