పవిత్ర మాసం.. ఉపవాసం కోసం!
ఇస్లామిక్ కాలదర్శినిలో ముహర్రమ్ మొదటి నెల. ఖురాన్లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్ నెలవంక దర్శనంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్ నెలగా ప్రసిద్ధి చెందింది. ముహర్రమ్ అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతనం అనే అర్థాలున్నాయి. ఈ నెల గొప్పదనాన్ని అల్లాహ్ ఖురాన్లో గొప్పగా వర్ణించాడు.
ఇస్లామిక్ కాలదర్శినిలో ముహర్రమ్ మొదటి నెల. ఖురాన్లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్ నెలవంక దర్శనంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్ నెలగా ప్రసిద్ధి చెందింది. ముహర్రమ్ అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతనం అనే అర్థాలున్నాయి. ఈ నెల గొప్పదనాన్ని అల్లాహ్ ఖురాన్లో గొప్పగా వర్ణించాడు. ‘రమజాన్ నెల తరువాత ముహర్రమ్ నెల ఉపవాసాలు ప్రముఖమైనవి. రమజాన్ తర్వాత ఉపవాసాలు పాటించాలని భావించేవారికి ముహర్రమ్ సరైన మాసం. ఇది అల్లాహ్ నెల. ఆషూరా రోజు ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది’ అని మహాప్రవక్త ఈ నెల ఔన్నత్యాన్ని పేర్కొన్నారు. ముహర్రమ్ నెలలో పదో రోజును యౌమె ఆషూరా అంటారు.
ఆనాడు ఉపవాసం చేస్తే గతేడాది చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని స్వయంగా ప్రవక్త (స) పేర్కొన్నారు. ఇస్లామిక్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ‘యౌమె ఆషూరా’ నాడే హజ్రత్ ఇమామె హుసేన్ (రజి) అమరులయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా వీరోచితంగా పోరాడింది అసువులు బాసింది ఇదే రోజు. అందుకే ఆ సందర్భంగా ముస్లింలు ఇమామె హుసేన్ (రజి) త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటారు. వందల ఏండ్ల కిందట ధర్మం కోసం ఇమామె హుసేన్ ‘కర్బలా’ మైదానంలో చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. నూతన సంవత్సరాన్ని పవిత్ర ఉపవాసాలతో ప్రారంభించి, కొత్త పుణ్యాలతో మంచి కాలానికి స్వాగతం పలుకుదాం.
…? ముహమ్మద్ ముజాహిద్ 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

