Srisailam Temple | శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు..
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కర్నాటక నుంచి భక్తులు రాలేకపోయారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఆంక్షలు సడలించడంతో ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు కాలినడకన క్షేత్రానికి తరలివస్తున్నారు. దేవస్థానం అధికారులు నెల రోజులుగా క్రితం నుంచి కర్నాటక రాష్ట్రానికి వెళ్లి దర్శన సమయాలు, ఆలయ నిబంధనలను వివరించినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా దేవస్థానం ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్సవాలు జయపద్రంగా విజయవంతమవుతున్నాయి.

ఈ సారి అంచనాలకు మించి భక్తులు వస్తుండడంతో దర్శనాలు కల్పించడం సైతం కష్టంగా మారిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేయగా.. కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నారు. దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులు వాగ్వాదం, ఘర్షణలకు దిగుతూ.. కంపార్ట్మెంట్లను ధ్వంసం చేస్తున్నారు. కాలినడకన క్షేత్రానికి చేరుకున్న వారంతా దర్శనానంతరం తిరుగుప్రయాణమవుతూ తమ ప్రాంతాలకు చెందిన బస్సులే కావాలంటూ టోల్గేట్ వద్ద మూడు గంటల సేపు రాస్తారోకో చేశారు. సుమారు ఐదు గంటలకుపైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థానం అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు రావొద్దు : ఈవో
కర్నాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామి వారి దర్శనానికి ఇప్పుడే రావొద్దని దేవస్థానం ఈవో లవన్న విజ్ఞప్తి చేశారు. ఉగాది ఉత్సవాలు ముగిసిన తర్వాత మాత్రమే రావాలని కోరారు. కర్నాటక నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండడంతో మరో నాలుగు రోజుల వరకు రద్దీగానే ఉంటుందని అన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు పలు ఆర్జితసేవా టిక్కెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Health tips | పాలలో చక్కెర కలుపుకుని తాగితే అనారోగ్యమట.. చక్కెరే కాదు ఇవి కూడా కలుపొద్దట..!
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

