Karthika somavaram | తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తజనం
Karthika somavaram | కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే శివాలయాలను దర్శించుకుంటున్న భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు.
Karthika somavaram | కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపారాధన చేశారు. విశేష సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారం పరమశివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు శివాలయాలను దర్శించుకుని దీపాలను వెలిగిస్తున్నారు.
ఇవాళ మూడవ కార్తీక సోమవారం. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివలాయాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయాన్నే భక్తులు శైవక్షేత్రాలకు తరలివెళ్లి కార్తీకదీపారాధన గావించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాజన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. వేములవాడ రాజన్న దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టనున్నది. మూడో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ ముందు భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామి వారి అలంకార దర్శనానికే భక్తులను అనుమతిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి, కపిలతీర్తం సహా ఇతర శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతిమి ఘాట్లలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

