తిరుమల : ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో 22 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శనివారం స్వామివారిని 84,873 మంది భక్తులు దర్శించుకోగా 36,286 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.67 కోట్లు ఆదాయం (Hundi kanukalu) వచ్చిందని వెల్లడించారు. 4.38 లక్షల లడ్డూలను విక్రయించామని ,2.42 లక్షల మందికి అన్న ప్రసాదం అందించామని పేర్నొన్నారు.
పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన శ్రీ వినోద్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీ అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.