పోషించే తల్లి పోచమ్మ
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయి
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయి. పోచమ్మ తల్లి అనుగ్రహం లేకపోతే పిల్లలకు చిన్నమ్మవారు, పెద్దమ్మవారు వచ్చిందని భావిస్తూ ఉంటారు. పోచమ్మ పోసింది అని చెబుతారు. ఈ సమయంలో పిల్లలు చలిజ్వరంతో బాధపడుతూ ఉంటారు.
పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, అమ్మ అనుగ్రహంగా వేప కొమ్మలు తెచ్చి పిల్లల శరీరానికి రాస్తారు. గదిలో అంతటా వేపమండలు పరుస్తారు. శీతల జ్వరాన్ని నివారించే దేవత కాబట్టి పోచమ్మతల్లిని ‘శీతల’ అని కూడా పిలుస్తారు. శాక్తేయ సంప్రదాయంలో శీతలాదేవి ఉపాసన విశేషంగా కనిపిస్తుంది. ఆ ఆదిపరాశక్తిని పోచమ్మగా తమ ఇంటి దైవంగా, గ్రామదేవతగా పూజించుకుంటారు జానపదులు. నల్లపోచమ్మను పార్వతీదేవి అంశగా భావిస్తారు. అమ్మవారు నల్ల పోచమ్మగా ఆవిర్భవించిన వైనాన్ని పాటలరూపంలో తలచుకుంటారు. ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో పోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు.
– అప్పాల శ్యామ్ప్రణీత్ శర్మ, 94409 51366
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

