‘విమాన’ ప్రయాణం
ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో ఒకతను ఇటీవల మరణించిన తన స్నేహితుడిని తలచుకొని బాధపడటం ప్రారంభించాడు.
ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో ఒకతను ఇటీవల మరణించిన తన స్నేహితుడిని తలచుకొని బాధపడటం ప్రారంభించాడు.
ప్రవచనకారుడు అతణ్ని అనునయిస్తూ.. అక్కడికి వస్తూ పోతూ ఉన్న విమానాలను చూడమన్నాడు. ‘చూశారా ఎన్ని విమానాలు వస్తున్నాయో! ఎవరు ఎక్కవలసిన విమానాన్ని వాళ్లు ఎక్కుతారు. చివరికి ప్రయాణికులు అందరూ వెళ్లిపోతారు. విమానాశ్రయంలో ఎవరూ ఉండరు కదా! మనిషి చావు పుట్టుకలు కూడా అంతే. ఇక్కడ ఎవ్వరికీ స్థిర నివాసం ఉండదు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముందు పిలుపు అందుకున్న వాళ్లు.. ముందుగా వెళ్లిపోతారు. కొందరు కాస్త వెనుక. కానీ, ఎవరూ ఇక్కడ శాశ్వతంగా ఉండిపోలేరు! పుట్టినప్పటి నుంచీ మృత్యువు నీడలా వెంటాడుతుంది.
మనం పోయినప్పుడు ఆ నీడ కూడా మాయమవుతుంది. మృత్యువుకు భయపడి జీవన యానం ఆపడం లేదు కదా! మరి పోయినవారిని గుర్తు చేసుకోవడం మంచిదే! వారి జ్ఞాపకాలను తలచుకోవడమూ మంచిదే!! కానీ, వారి గురించి పదేపదే ఆలోచిస్తూ, కుంగిపోవడం సరికాదు! ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితాన్ని అనుక్షణం సద్వినియోగం చేసుకుంటూ, సంతోషంగా గడపడమే మనం చేయాల్సింది’ అని చెప్పాడు పండితుడు. స్నేహితుడి మరణానికి కుంగిపోతున్న ఆ మనిషి కొన్నాళ్లకు తేరుకున్నాడు. ఆనందంగా జీవనం కొనసాగించాడు.
…?ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

