Ananya Panday | అనన్యా పాండే డ్యాన్స్‌పై ట్రోలింగ్.. కూతురుకి మద్దతుగా నిలిచిన చుంకీ పాండే!
Chunky Panday | బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే నటించిన తాజా చిత్రం 'చంద్ మేరా దిల్' లోని ఒక చిన్న డ్యాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Ananya Panday Dance | బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే నటించిన తాజా చిత్రం ‘చంద్ మేరా దిల్’ లోని ఒక చిన్న డ్యాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య చేసిన భరతనాట్యం స్టెప్పులపై క్లాసికల్ డ్యాన్సర్లు, నెటిజన్లతో పాటు కొందరు రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శాస్త్రీయ నృత్యాన్ని ఆమె అవమానించిందంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, ప్రముఖ నటుడు చుంకీ పాండే తన కుమార్తెకు మద్దతుగా నిలుస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు కనీసం ఆ డ్యాన్స్ వెనుక ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోకుండానే విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సాంప్రదాయ భరతనాట్యం కాదని, కేవలం కాలేజీ రోజుల్లో విద్యార్థులు సాంస్కృతిక వేడుకల్లో చేసే ఒక రకమైన ప్రయోగాత్మక ఫ్యూజన్ డ్యాన్స్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛమైన భరతనాట్యం నేర్చుకోవడానికి దాదాపు 20 ఏళ్ల కఠోర సాధన, క్రమశిక్షణ అవసరమని, అది ఎంతో సాంకేతికతతో కూడుకున్నదని చెబుతూ, ఈ సినిమాలో చూపించింది కేవలం సంప్రదాయ నృత్య మూలాలతో కూడిన భవిష్యత్ అడ్వాన్స్డ్ డ్యాన్స్ రూపాల కలయికే తప్ప శాస్త్రీయ ప్రదర్శన కాదని వివరించారు. కాబట్టి సినిమా చూడకుండా ఎవరూ తొందరపడి స్పందించవద్దని ఆయన కోరారు.
మరోవైపు ఈ చిత్ర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనన్య ఆర్. కురుప్ కూడా నటి అనన్యా పాండేకు మద్దతుగా నిలిచారు. షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని తెరవెనుక చిత్రాలను పంచుకుంటూ, తన కంఫర్ట్ జోన్ దాటి ఒక సరికొత్త శాస్త్రీయ నృత్య రూపాన్ని ప్రయత్నించడానికి చాలా ధైర్యం, అంకితభావం కావాలని ఆమె పేర్కొన్నారు. భరతనాట్యంలో పట్టు సాధించడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని, కానీ అనన్య చాలా తక్కువ సమయంలోనే ఎంతో కష్టపడి తన నటనతో మెప్పించిందని ప్రశంసించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

