Bengal CM | గెంటివేయకముందే పారిపోండి.. అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్
Bengal CM | ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని బంగ్లాదేశీ అక్రమ వలసదారుల (Bangladeshi Infiltrators) పై సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం సువేందు చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
Bengal CM : ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని బంగ్లాదేశీ అక్రమ వలసదారుల (Bangladeshi Infiltrators) పై సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం సువేందు చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. బెంగాల్ నుంచి వెళ్లగొట్టకముందే పారిపోవాలని సూచించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు బెంగాల్ సీఎం చెప్పారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని, వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని సువేందు అన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయమిచ్చి, తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అని ప్రశ్నించారు.
బెంగాల్ ప్రభుత్వం ‘గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి’ అనే నినాదంతో విదేశీయులను దేశం నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడినట్లు గుర్తించిన వారికి, సరైన పత్రాలు లేని వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, అక్రమంగా రాష్ట్రంలోకి వలస వచ్చిన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి పయనమవుతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఈ సరిహద్దు నుంచి వందల సంఖ్యలో బంగ్లాదేశీయులు తమ దేశానికి వెళ్లినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

