Petrol Shortage Rumors | డీజిల్, పెట్రోల్ కొరత పుకారు.. ప్లాస్టిక్ క్యాన్లు, వాహనాలతో క్యూ
Petrol Shortage Rumors | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ప్లాస్టిక్ క్యాన్లతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ప్లాస్టిక్ క్యాన్లతో ( Plastic Cans ) పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. మంగళవారం ఉదయం నుంచి పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ కొరత ( Petrol Shortage ) వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలతో తరలివచ్చి రోడ్డు గుండా వాహనాలను క్యూ లైన్ లో నిలిపారు.

ఇంధనం కొరత కారణంగా వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు నడవడం లేదని మండల రైతాంగం అయోమయానికి గురవుతుంది. ఖరీఫ్ సమీపించిన వేళ డీజిల్ కొరత కారణంగా వ్యవసాయ పనులు పూర్తికాక పోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత లేదని పేర్కొంటున్న అధికారులకు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ పొడవున వాహనాలతో క్యూలైన్లు కనిపించడం లేదా అంటూ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

