నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువు జరుగనుండగా.. బుధవారం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ట్రాఫిక్ ఆంక్షలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల సందర్భంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుండి ఫతే నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వద్ద, ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్ – బీకేగూడ క్రాస్ రోడ్ – శ్రీరామ్ నగర్ క్రాస్‌రోడ్స్ – సనత్ నగర్ నుంచి ఫతే నగర్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలకు అనుమతించరు. కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం-బేగంపేట వైపు మళ్లించనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ – బకుల్ అపార్ట్మెంట్లు – ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు బల్కంపేట్ వైపు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఫుడ్ వరల్డ్ క్రాస్‌రోడ్‌లో సోనాబాయి టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం నుంచి ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. బేగంపేట, కట్టమైసమ్మ దేవాలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనదారులకు అనుమతి ఉండదని, గ్రీన్‌ల్యాండ్స్ – మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ ఎడమ మలుపులో ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు అన్ని సబ్ లైన్లు, లింక్‌రోడ్లను మూసివేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

