‘పంచమ వేదం’ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? ‘రామాయణాన్ని పంచమ వేదం’ అని పిలువవచ్చునా? -డి. వెంకటయ్య, టీచర్,బోడుప్పల్, హైదరాబాద్
‘మహాభారతాన్ని’ మాత్రమే పంచమవేదమని పిలుస్తారు. ‘భగవద్గీత’ మహాభారతంలో ఉన్నందువల్లనే ఈ ఇతిహాసానికి ఆ పేరు వచ్చింది. ‘రామాయణాన్ని’ ఆ పేరుతో పిలిచే సంప్రదాయం లేదు. మరొక విషయం ఏమిటంటే, వేదాలకు వ్యాసమహర్షి తన శిష్యులద్వారా ప్రచారంగావించాడు. కనుక,‘వేదవ్యాసుడ’య్యాడు. ఆ వేదవ్యాస మహర్షి చేత ప్రణీతమైనందున మహాభారతమే పంచమ వేదమనీ పిలువబడింది. నిజానికి వేదాలు నాలుగే. అవి మానవ నిర్మితాలు కావు. అపౌరుషేయాలు. అంటే, ఈశ్వరీయాలు. అయిదవ వేదంగా మహాభారతాన్ని మాత్రమే పిలుస్తాం.