AA22xA6 | పుష్ప 2 ది రూల్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం AA22xA6 (వర్కింగ్ టైటిల్). కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న స్పెషల్ గ్లింప్స్ వీడియో ఉండబోతుందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే అలాంటిదేమి లేదట. తాజా టాక్ ప్రకారం బర్త్ డేన ఎలాంటి వీడియో కంటెంట్ లేకుండా కేవలం టైటిల్ పోస్టర్‌ను మాత్రమే వదలబోతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు ఓ ఈవెంట్లో చెప్పాడు. టైటిల్, పోస్టర్ రాబోతుంది. నాకు తెలిసినంతవరకు విజువల్ కంటెంట్ ఏం రిలీజ్ చేయడం లేదు. ఇది ప్రత్యేకమైన సినిమా అని ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి విజువల్ కంటెంట్‌ను రిలీజ్ చేయకుండా వెనక్కి తగ్గారని చెప్పాడు. కాగా ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి తాజా వార్తతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. డ్యూడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తొలిసారి వస్తున్న సినిమా కావడం..లీడింగ్ బ్యానర్ అయిన సన్ పిక్చర్స్‌లో వస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్‌కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్