1.ప్రపంచ మెమరీ లీగ్ చాంపియన్‌షిప్ 2025 పోటీల్లో భారతదేశానికి చెందిన విద్యార్థి విజేతగా నిలిచాడు. అతనెవరు?
2.తెలుగు నటుడు అల్లు అర్జున్ చిత్రం కవర్ పేజీతో ఓ ప్రముఖ సినీ మ్యాగజైన్ తన తొలి సంచికను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ మ్యాగజైన్ ఏది?
3.ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు?
4.భారతదేశ శాస్త్రీయ నృత్యాల్లో ఒడిస్సీ ఒకటి. ఈ నృత్యానికి చెందిన ప్రముఖ కళాకారుడు ఫిబ్రవరి 22న మరణించారు. ఆయన ఎవరు?
5.మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న నాయకులుగా టైమ్ మ్యాగజైన్ 13 మంది మహిళలతో ‘విమెన్ ఆఫ్ ది ఇయర్ 2025’ జాబితాను ప్రకటించింది. ఇందులో ఓ భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు చోటు దక్కించుకున్నారు. ఆమె పేరేంటి?
6.ఐటీ సంస్థ సైయెంట్ లిమిటెడ్ హైదరాబాద్ నగరం కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇటీవల ఈ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు?
7.భారతదేశానికి చెందిన వివిధ నృత్యరీతులను 139 మంది కళాకారులు 24 గంటలపాటు ఆపకుండా ప్రదర్శన ఇచ్చారు. దీనికి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కింది. ఈ ప్రదర్శన ఎక్కడ జరిగింది?
8.టేస్ట్ అట్లాస్ ఈ ఏడాది ‘వరల్డ్స్ బెస్ట్ ఎగ్ డిషెస్’ జాబితాను ప్రకటించింది. గుడ్డుతో చేసే మొదటి 50 వంటకాల్లో ఓ భారతీయ వంటకం 22వ స్థానంలో నిలిచింది. అదేంటి?
9.అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ (ఎఫ్‌బీఐ)కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి ఎవరు?
10.జర్మనీ పార్లమెంట్‌కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటిలో ప్రతిపక్ష కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి కొత్త చాన్స్‌లర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వచ్చాయి?
జవాబులు