ఢిల్లీ : పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్‌లోని మసూద్‌పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు. నిందితుడు మహిళ తలపై ఇటుకతో గట్టిగా కొట్టడంతో ఆమె మరణించింది. మే 24న వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో కేసు నమోదు చేసి ఆ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.
మృతదేహం వద్ద మెహ్రౌలి ప్రాంతంలోని ఓ షాపు పేరుతో కూడిన క్యారీబ్యాగ్ లభించడంతో ఆ దిశగా మృతురాలిని గుర్తించేందుకు దర్యాప్తు సాగించారు. ఆమె కుటుంబ సభ్యుల సాయంతో మృతురాలిని గుర్తించిన తర్వాత హత్య జరిగిన రోజు బాధితురాలితో నిందితుడు ఉన్నట్టు గుర్తించారు.
జూన్ 16న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలితో తనకు సన్నిహిత సంబంధం ఉందని, పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తుండటంతో వదిలించుకునేందుకు హత్య చేయాలని నిర్ణయించానని దర్యాప్తులో నిందితుడు వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు నిందితుడు మద్యం సేవించి ఆపై మృతురాలిని సైకిల్‌పై నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. మహిళ సమ్మతితో శృంగారంలో పాల్గొన్న నిందితుడు ఆపై ఆమె తలపై ఇటుక రాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.