బెంగళూర్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేసిన ఘటన కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో వెలుగుచూసింది. సర్పూర్ తాలూకాలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని గంగప్ప బసప్పగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సోమవారం తెల్లవారుజామున వివాహిత ఇంట్లో చొరబడి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
మహిళ ప్రతిఘటించడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. తన కోరికను తీర్చేందుకు మహిళ నిరాకరించడంతో బైక్పై బయటకు వెళ్లిన నిందితుడు పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.