Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో సినిమా స్టైల్లో కిడ్నాప్ జరిగింది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు. ఖమ్మం జిల్లాకు చెందిన సన్నీ ఇటీవలే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యతో కలిసి గురువారం మధ్యాహ్నం కొత్తగూడెంకు బయల్దేరాడు. దారి మధ్యలో సన్నీ, అతని భార్యను గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. సన్నీపై దాడి చేసి.. భార్యను ఎత్తుకెళ్లారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన భార్యను ఎత్తుకెళ్లారంటూ సన్నీ ఆరోపించాడు. బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోయారని తెలిపాడు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని సన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.