Viral Video | ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా ఈ కిరాతకానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్కు చెందిన పరమేశ్, అనూష (22) ప్రేమించుకున్నారు. పరమేశ్ పట్టుబట్టడంతో అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే, 8 నెలల క్రితం పెళ్లి జరిపించారు. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తితో సంతోషంగా గడపొచ్చని భర్తతో మెట్టింటికి అడుగుపెట్టిన అనూషకు నిరాశే ఎదురైంది. అత్తమామలతో పాటు భర్త నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా కట్నం కోసం వారు వేధింపులకు గురిచేశారు. వారం రోజుల క్రితం విచక్షణారహితంగా కొట్టారు. ఈ విషయం తెలిసిన అనూష తల్లి, సోదరుడి వరసయ్యే వ్యక్తి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
అయితే అనూషను మంచిగా చూసుకుంటానని చెప్పిన పరమేశ్.. గురువారం నాడు ఆమెను తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత మరోసారి అనూషతో గొడవపడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో అనూష అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అనూష మృతిచెందింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేచస్తున్నారు. కాగా, అనూషను పరమేశ్ ఇంటి బయట విచక్షణారహితంగా కొట్టడం అక్కడే సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Sensitive Content
సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్త
తాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..
కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతి
యువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025