Khammam Rural : ఇంట్లోనే పిల్లలు.. ఊరంతా వెతుకులాట
సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కుమారుడు అలాగే
– ఆరెంపులలో బాలల మిస్సింగ్‌పై వీడిన సస్పెన్స్
ఖమ్మం రూరల్, డిసెంబర్ 19 : సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కుమారుడు అలాగే ఆయన ఇంటికి వచ్చిన సోదరి కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి ముందటికి వచ్చిన చిరు వ్యాపారి దగ్గర బేరం చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. ఈలోగా సదరు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ మెల్లగా ఇంట్లోకి వెళ్లారు. అయితే కొద్దిసేపటికి ఆడుకుంటున్న పిల్లలు కనపడకపోయేసరికి ఇంటికి తాళం వేసి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు.
ఎంతకీ కనపడకపోయేసరికి ఊర్లో ఉన్న సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులు, ఊరి బయట చెరువు, కాలువల్లో వెతకడం ప్రారంభించారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వాట్సాప్‌లో చిన్నారుల ఫొటోలు అప్లోడ్ చేసి మిస్సయిన పిల్లల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు అటు సోషల్ మీడియాలో, ఇటు గ్రామంలో, గ్రామ శివారుల్లో పిల్లల కోసం వెతికారు. చివరకు పిల్లల మిస్సింగ్ పై రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సిద్ధపడగా కొందరు గ్రామస్తులు ఇచ్చిన సలహా ప్రకారం తాళం తీసి ఇంట్లో చూడగా పిల్లలు ఇంట్లోనే కనపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

