కులకచర్ల : ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన అనిత(24) అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో 2017 సంవత్సరంలో వివాహం జరిగింది. గురువారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అనిత దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని పోలీసుల తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.