మర్పల్లి : మండలంలోని పట్లూర్లో ఆదివారం పేకాట ఆడుతున్న 16మందిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం 2గంటల సమయంలో షేక్ అమినుద్దీన్ ఫామ్ హౌస్లో దాడులు నిర్వహించి పట్లూర్, కోహీర్, హైదరాబాద్కు చెందిన 16 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 3 కార్లు, 12 బైకులు, 17 సెల్ఫోన్లు, రూ. 60,850, 8సెట్ల కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.