మద్యం రవాణా చేస్తున్న వాహనం బోల్తా… మద్యం బాటిళ్లు లూటీ
చెన్నై: మద్యం రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది. సుమారు పది లక్షల విలువైన మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనం మధురై సమీపంలోని విరగనూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో మద్యం సీసాలున్న పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అందినకాడికి మద్యం సీసాలు, పెట్టెలను తమ వెంట తీసుకుపోయారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మద్యం సీసాలు, పెట్టెలను స్థానికులు పట్టుకెళ్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, ఏప్రిల్ 20న మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. బీరు క్యాన్లతో వెళ్తున్న వాహనం బర్వానీలోని వంతెనపై ఒక కారును ఢీకొట్టింది. దీంతో వంతెనపై చెల్లాచెదురుగా పడిన బీరు క్యాన్లను అటుగా వెళ్తున్న వారు పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మిగతా బీర్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

